న్యూఢిల్లీ : భారత్ లో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ( ఐఓసీఎల్ ) ట్రేడ్ అప్రెంటిస్ లను అందిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1196 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులున్నాయి. ఇవి నార్తర్న్ రీజియన్, వెస్ట్రన్ రీజియన్ లో ఖాళీగా ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు : 1196 ఇందులో నార్తర్న్ రీజియన్ లో 626, వెస్ట్రన్ రీజియన్ లో 570 చొప్పున ఖాళీలున్నాయి.
అర్హతలు : ఇంటర్ , డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 31 ( నార్తర్న్ రీజియన్ ), ఫిబ్రవరి 15 ( వెస్ట్రన్ రీజియన్ )
వెబ్ సైట్ : https://iocl.com/