వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ఏటూరు నాగారం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఓ విద్యార్థి ఆలస్యంగా వచ్చాడని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు కాలేజీ సిబ్బంది. మండలంలోని శివాపూర్ గ్రామానికి చెందిన దాసరి సత్యనారాయణ ఇంటర్ రెండవ సంవత్సరం బైపిసి చదువుతున్నాడు. తమ గ్రామమైన శివాపూర్ నుండి వాహన సౌకర్యాలు లేక 15 నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం ఆలస్యమైందని కాలేజీ పరీక్షా సిబ్బంది పరీక్షా కేంద్రంలోకి అనుమతించకుండా నిరాకరించారు. దీంతో ఆ విద్యార్థి తిరిగి వెళ్లలేక ఓ గంటపాటు పరీక్షా కేంద్రం ఎదుటే పడిగాపులుగాసాడు. అయినా సిబ్బంది జాలి చూపకపోవడంతో నిరుత్సాహంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.