హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, నేడు, రేపు తెలంగాణలో అనేక చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 లేదా 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం వున్నట్లు ప్రకటించింది. నేడు, రేపు ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల చలిగాలులు వీచే అవకాశం వుందని తెలిపింది.