భారత్ లో కొత్తగా 3,614 కరోనా కేసులు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 3614 కరోనా కేసులు నమోదవగా, 89 మంది మృతి చెందారు. మరో 5185 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసులు 4,29,87,875 కు చేరాయి. ఇందులో 4,24,31,513 మంది బాధితులు కోలుకున్నారు.మరో 40,559 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,15,803 మంది మహమ్మారి బారికి బలయ్యారు. మొత్తం కేసుల్లో 0.09 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని, 98.70 శాతం మంది డిశ్చార్జీ కాగా, 1.20 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.44 శాతమని తెల్పింది. ఇక దేశవ్యాప్తంగా 1,79,91,57,486 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో శుక్రవారం ఒక్కరోజే 18,18,511 మంది వ్యాక్సినేషన్ చేశామని తెల్పింది.