5300 మంది రష్యా సైనికులు మృతి
వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ పై దాడికి వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ చేసిన ఎదురుదాడిలో 5300 మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు ఆ దేశ రక్షణశాఖ వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడికి నేటితో 5 రోజులయ్యాయి. నేడు కీవ్ లోని రక్షణ కార్యాలయం తన ఫేస్ బుక్ లో ఓ స్టేట్మెంట్ ను పోస్టు చేసింది. తమ సైన్యం జరిపిన కాల్పుల్లో 5300 మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు.ఆ దాడిలో రష్యాకు చెందిన 191 ట్యాంకులు, 29 ఫైటర్ విమానాలు, 29 హెలికాప్టర్లు, 816 యుద్ధ వాహనాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ తెల్పింది. అయితే ఈ విషయాన్ని రష్యా పూర్తిగా ధ్రువీకరించలేదు. కానీ బ్రిటన్ రక్షణ శాఖ మంత్రి మాత్రం తాజా దాడిలో రష్యాకు తీవ్ర నష్టం ఎదురైనట్లు వ్యాఖ్యానించారు. మొదటి 4 రోజుల్లోనే రష్యా తన సైన్యాన్ని భారీగా కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం రష్యా సైన్యం కూడా ఓ కీలక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. తమ సైన్యం చాలా నష్టపోయినట్లు ఆ ప్రకటనలో రష్యా చెప్పింది. కానీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదు.