న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే 6.5 శాతం కేసులు తక్కువగా నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 7,141 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 75,841 రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది.
మరోవైపు దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. నిన్నటితో పోల్చితే నేడు 37 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 578 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఢిల్లీలో అత్యధికంగా 142, మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్ లో 49, రాజస్థాన్లో 43, తెలంగాణలో 34, తమిళనాడులో 31, మధ్యప్రదేశ్ లో 9, ఆంధ్రప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ లో 6 కేసుల చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక ఒడిశా, హర్యానాలో 4 కేసులు, చండీఘర్ , జమ్మూకశ్యీర్ లో 3 కేసులు, యూపీలో 2, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, ఉత్తరాఖండ్ లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.