ఎన్టీపీసీలో 60 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అప్లికేషన్లు ఈ నెల 21 వరకు అందుబాటులో ఉంటాయని తెల్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి ఫైనాన్స్, హెచ్ ఆర్ విభాగంలో ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.మొత్తం ఖాళీలు : 60 ఇందులో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ ( సీఏ/సీఎంఏ) -20, ఎంబీఏ- 10, హెచ్ ఆర్ – 30 చొప్పున ఖాళీలున్నాయి.
అర్హతలు : సీఏ, సీఎంఏ, ఎంబీఏ, డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు 29 యేళ్లలోపు వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : ఆన్లైన్ రాతపరీక్ష
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు : రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 21
వెబ్ సైట్ : www.ntpc.co.in