ప్రశంసలు కాదు..నిధులు ఇవ్వండి : ఎర్రబెల్లి

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రశంసలే కాకుండా నిధులు కూడా ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆన్‌లైన్‌ ఆడిట్‌లో కేంద్రం ప్రశంసించింనందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సహాయ సహకారాలు అందించిన ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా అహర్నిశలు కృషి చేసిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు, సిబ్బందికి, ఆడిట్ శాఖ అధికారులకు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అనేక అంశాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అయితే కేంద్రం మాత్రం ప్రశంసలు మాత్రమే ఇస్తూ నిధులు మాత్రం ఇవ్వడంలేదని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకొని రాష్ట్రానికి నిధులను విడుదల చేయాలన్నారు.