వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా: రేపు జనగామ పర్యటనకు వస్తున్న రాష్ట్ర సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 105 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొదలైన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈ వాహనాలను సిద్ధం చేశారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు 105 మందికి ఉచితంగా అందించడం జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.