జంపన్నవాగులో మంత్రి సత్యవతి పూజలు

జంపన్నవాగులో మంత్రి సత్యవతి పూజలు

వరంగల్ టైమ్స్, ములుగుజిల్లా: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మేడారం జాతరను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న వసతులు, జంపన్నవాగు దగ్గర స్నాన ఘట్టాలు, స్నానం చేసేందుకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. స్వయంగా జంపన్న వాగులో దిగి భక్తులతో మాట్లాడారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి జంపన్నవాగులో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, తలనీలాలు సమర్పించి స్నానాలు ఆచరించారు.