వాయిదా పడిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష

వాయిదా పడిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష

వరంగల్ టైమ్స్,ఎడ్యుకేషన్ డెస్క్: నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ఆరోగ్యశాఖ వాయిదా వేసింది. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షకు సంబంధించిన వివరాలు nbe.edu.in, natboard.edu.inవెబ్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. నీట్ పీజీ పరీక్ష మే 21న జరుగనున్నది.నీట్ పీజీ కౌన్సిలింగ్, ప్రవేశ పరీక్ష తేదీలు క్లాష్ అవుతుండటంతో పలువురు అభ్యర్థులు నీట్ పీజీ 2022ని వాయిదా వేయాలని వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మే 21న పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ పరీక్షను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు.