వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా గత మూడ్రోజులుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి నేడు వనదేవతల సన్నిధిలో కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. మేడారం సన్నిధిలో సమ్మక్క, సారలమ్మలకు కేసీఆర్ ఎత్తు బంగారాన్ని సమర్పించి, సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.. తెలంగాణ రాష్ట్రాన్ని సుపరిపాలనగావిస్తున్న సీఎం, తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, వనదేవతల కృప కేసీఆర్ పై ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం కోరిన కోర్కెలు తీర్చే వనదేవతలను దర్శించుకోవడం సంతోషకరమని అన్నారు.
Home News