కేసీఆర్ తన మేనమామతో ఏం చెప్పారో తెలుసా..?

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ విద్యార్థి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ తన జీవితంలోకి ఎలా పైకి వచ్చారు.. రాజకీయంగా ఎలా ఎదిగారు అనే విషయాలను కేటీఆర్ విడమరిచి చెప్పారు. కండ్లకోయలో ఐటీ పార్కు శంకుస్థాపన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ 68 యేళ్ల కిందట చింతమడకలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కేసీఆర్ కు 9 మంది అక్కాచెల్లెళ్లు, ఒక అన్న. మా తాత పెద్ద వ్యవసాయదారుడు. ఐదారువందల ఎకరాలు కల్గిన వ్యక్తి. రాజకీయంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. జూనియర్ కాలేజీ, డిగ్రీ సిద్ధిపేటలో చదివారు. పీజీ కోసం హైదరాబాద్ కు వచ్చారు. కేసీఆర్ మేనమామ కమలాకర్ రావు హైదరాబాద్ కు వచ్చి ఆయనను కలిశారు.

మీ నాన్న ఒక్కడే కష్టపడుతున్నాడు. 9 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లి చేయాలి కదా.. ఇంటికి వెళ్లొచ్చు కదా, టీచర్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పాడు. నాకు
అప్పుడు నాకు ఉద్యోగం చేసే ఆసక్తి లేదు. రాజకీయంగా లేదా పబ్లిక్ లైఫ్ లో ఉండదల్చుకున్నాను అని కేసీఆర్ తన మేనమామకు చెప్పాడు. చేతకాని వారంగా ఇదే మట్లాడుతారు. కలల ప్రపంచంలో బతుకొద్దు. ఒక టీచర్ ఉద్యోగం ఇప్పిస్తా రా అని చెప్పిండు. అయినా కేసీఆర్ వినలేదు. 22 యేళ్ల వయసులో కేసీఆర్ అన్న మాట.. నేను ఎక్కువ చెప్పట్లేదు. నా ఉనికిలో నీ నీడ చూసుకునే రోజు వస్తదని మేనమామతో కేసీఆర్ చెప్పాడు.

మనం చేసే పనిలో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మస్థైర్యం ఉండాలి. ఇది కేసీఆర్ కు జరిగిన మొదటి అనుభవం. ఒక మనిషి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కేసీఆర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు అని కేటీఆర్ స్పష్టం చేశారు.