వరంగల్ టైమ్స్, తిరుమల: తిరుమలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం భక్తులకు కేటాయించేందుకు శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లెటర్స్ పై కేటాయించే వీఐపీ దర్శనాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వీఐపీలకు కేటాయించిన సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించనున్నట్లు వివరించారు. అందుకు అనుగుణంగా అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే సర్వదర్శనం భక్తులకు రోజుకు 30 వేల టోకెన్లు జారీ చేస్తుండగా తాజా నిర్ణయంతో మరో 2 గంటల దర్శన సమయం పెరుగనుంది.
Home News