మెట్టుగుట్ట రామలింగేశ్వరునికి జంగా ప్రత్యేక పూజలు

మెట్టుగుట్ట రామలింగేశ్వరునికి జంగా ప్రత్యేక పూజలు

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాజీపేట మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు జంగా రాఘవరెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. గత రెండేండ్లుగా కరోనా మహమ్మారితో దైవ పూజలకు దూరమైన భక్తులు సుఖ సంతోషాలతో శివాలయానికి చేరుకొని పూజలు చేసుకోవడం సంతోషంగా ఉందని జంగా రాఘవరెడ్డి అన్నారు. ప్రకృతి ప్రలోభాలకు ప్రజలు గురికాకుండా, మహమ్మారి వైరస్ లకు ప్రజలు గురికాకుండా ముక్కంటి దేవుడు పరమశివుడు కాపాడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మెట్టు రామలింగేశ్వర స్వామిని ప్రార్థించినట్లు జంగా రాఘవరెడ్డి తెలిపారు.

మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న వారిలో స్థానిక కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయ శ్రీ రజాలీ, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ బైరి లింగమూర్తి వరలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుర్లా మోహన్, కొప్పుల నవీన్, అమరీందర్, నాగరాజు నాగేష్, రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు వున్నారు.