నేడు న్యూజిలాండ్, భారత్ మధ్య పోరు

నేడు న్యూజిలాండ్, భారత్ మధ్య పోరు

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఘన విజయం సాధించి బోణీ కొట్టిన భారత్ మలి మ్యాచ్ లో ఆతిథ్య న్యూజిలాండ్ పోరుకు సై అంటున్నది. ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఎదురైన ఓటమికి కసితీరా ప్రతీకారం తీర్చుకోవాలని మిథాలీసేన పట్టుదలతో కనిపిస్తుంటే కివీస్ తమ జోరు కొనసాగించేందుకు తహతహలాడుతున్నారు. ఈనేపథ్యంలో గురువారం ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది.కివీస్ పరిస్థితి ఇది : సొంతగడ్డపై జరుగుతున్న మెగాటోర్నీలో న్యూజిలాండ్ పయనం పడుతూ లేస్తూ కొనసాగుతున్నది. తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో ఓడిన కివీస్ , రెండో మ్యాచ్ లో బంగ్లాను చిత్తుచేసింది. మిగిలిన మ్యాచుల్లో తప్పక గెలిస్తేనే సెమీస్ బెర్త్ దక్కించుకునే అవకాశమున్న నేపథ్యంలో భారత్ తో మ్యాచ్ ను న్యూజిలాండ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది.