ప్రాంతీయ పార్టీలు ఏకమైతే మంచిదేనన్న దేవేగౌడ 

ప్రాంతీయ పార్టీలు ఏకమైతే మంచిదేనన్న దేవేగౌడ

వరంగల్ టైమ్స్, బెంగళూరు : దేశ ప్రయోజనాల కోసం లౌకిక ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే మంచిదేనని జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ లౌకిక భావజాలం గల ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే బాగుంటుంది. ఇందులో కాంగ్రెస్ కూడా ఉంటే మంచిది.కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ ఈ రోజు దాని పరిస్థితి ప్రాంతీయ పార్టీలాగే మారిపోయింది’ అని పేర్కొన్నారు. గతంలో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తాను ప్రయత్నించానని గుర్తు చేశారు. ఇక దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని, ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే పంజాబ్ లో ఓటమికి కారణమని దేవేగౌడ అభిప్రాయపడ్డారు.