బ్రౌన్ షుగర్ సప్లై..నలుగురు అరెస్ట్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బ్రౌన్ షుగర్ అమ్ముతున్న వ్యక్తితో పాటు ముగ్గురు కస్టమర్లను మల్కాజిగిరి ఎస్ఓటీ, నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నేరెడ్ మెట్ లోని డీసీపీ ఆఫీసులో మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి వివరాలు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్ కి చెందిన ఎండీ అక్తర్ ఉజ్మాన్ ( 26) కొంతకాలం కొందట సిటీకి వచ్చి గచ్చిబౌలిలో ఉంటూ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ హెల్పర్ గా పనిచేస్తున్నాడు.
డ్రగ్స్ సప్లై కోసం వెస్ట్ బెంగాల్ కి చెందిన షాజహాన్, ఒప్పు అనే ఇద్దరిని కలిశాడు. అక్కడి నుంచి సిటీకి డ్రగ్స్ సరఫరా చేయడం మొదలు పెట్టాడు. జార్ఖండ్ కు చెందిన షేక్ దనిశ్ (22), మెహబూబ్ ఖాన్ ( 23), ఎండీ నజీర్ (24) సిటీలో ఉంటూ బిల్డింగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు ఉజ్మాన్ దగ్గర బ్రౌన్ షుగర్ కొనేవారు.
అప్పుడప్పుడు గచ్చిబౌలిలో ఉండే మెహతాబ్ ఆలం దగ్గర కూడా వీళ్లు డ్రగ్స్ కొనేవారు. శుక్రవారం రాత్రి దనిశ్, మెహబూబ్, నజీర్ మల్లాపూర్ చౌరస్తా వద్ద అక్తర్ ఉజ్మాన్ వద్ద బ్రౌన్ షుగర్ ను కొంటుండగా, మల్కాజిగిరి ఎస్ఓటీ, నాచారం పోలీసులు వారిని పట్టుకున్నారు. ఉజ్మాన్ తో పాటు కస్టమర్లు దనిశ్, మెహబూబ్ ఖాన్, నజీర్ ను అదుపులోకి తీసుకున్నారు. రూ. లక్ష విలువైన 16 గ్రాముల బ్రౌన్ షుగర్ , రూ.1900 క్యాష్ సీజ్ చేశారు. నిందితులను రిమాండ్.