మేనేజ్మెంట్ లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను వరంగల్ జిల్లాలోని కాళోజి హెల్త్ యూనివర్సిటీ నేడు విడుదల చేసింది. మార్చి 21న ఉదయం 6 గంటల నుండి 22 మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు ప్రాధాన్యతాక్రమంలో కళాశాలలకు ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్ https://tspvtmedadm.tsche.in/ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.