సూర్యపేటకు ఐటీ హబ్..ప్రకటించిన కేటీఆర్
ఫలించనున్న మంత్రి జగదీష్ రెడ్డి కృషి
ముందుకొస్తున్న గ్లోబల్ ఐటి మరియు ఇతర సంస్థలు
అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రకటించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
వరంగల్ టైమ్స్, సూర్యాపేట జిల్లా : సూర్యపేట జిల్లా ప్రజలకు తీపి కబురు.జిల్లా కేంద్రంలో త్వరలో ఐటీ హబ్ ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన కృషి ఫలించబోతుంది. ఈ మేరకు సూర్యపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో ప్రకటించారు. అందుకుగాను గ్లోబల్ ఐటి సంస్థతో పాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.