‘ఆర్ఆర్ఆర్’ మూవీ రివ్యూ

‘ఆర్ఆర్ఆర్’ మూవీ రివ్యూ

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చిది. అగ్రరాజ్యం అమెరికాలో ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేయగా, భారత్ లో రిలీజ్ డే ఎర్లీ మార్నింగ్ హవర్స్ లో బెన్ ఫిట్ షోలు వేశారు. ఈ సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడి, ఎట్టకేలకు విడుదల అయింది. దీంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ సంతోషపడిపోతున్నారు. ప్రతీ భారతీయ సినీ ప్రేక్షకుడు ఈ సినిమా చూసి గర్వపడుతాడని అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది? దర్శకుడు రాజమౌళి ప్రేక్షకుడిని ఎలాంటి అనుభూతిలోకి తీసుకెళ్లాడు? అనే విషయాలు తెలుసుకుందాం.

'ఆర్ఆర్ఆర్' మూవీ రివ్యూఅసలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కథేంటి అనే విషయానికొస్తే 1920 కాలంలో భారత దేశాన్ని బ్రిటీష్ వారు పాలిస్తున్న కాలంలో సినిమా మొదలవుతుంది. ఇందులో రామరాజు అనే పాత్రను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషించాడు. పోలీస్ ఆఫీసర్ గా రగ్డ్ అండ్ రూత్ లెస్ లుక్ లో ఉన్న చరణ్ ను చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే వస్తాయి. భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఫ్యాన్స్ కు ఇట్టే కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలోనే భారతదేశ స్వాతంత్ర్యం, ప్రజల కోసం ఢిల్లీలోని బ్రిటీష్ సర్కారు పైన భీమ్ దాడికి దిగుతాడు. బ్రిటీష్ పాలనకు ఎదురు తిరిగిన నేపథ్యంలో భీమ్ ను పట్టుకునేందుకు గాను రామరాజును బ్రిటీష్ ప్రభుత్వం వారు ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ గా నియమిస్తారు. ఈ సినిమాలో సీత పాత్రలో ఆలియా భట్ నటన సూపర్ .

జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు తప్ప, మిగతా అందరూ సహాయక పాత్రలు పోషిస్తారు. తారక్ తో కొన్ని కీలకమైన క్షణాలు మినహా ఆలియా భట్ కి ఏమీ లేదు. చరణ్ కి జోడీగా ఆలియా భట్ నటిస్తోంది. అయితే ఆమెకు జూనియర్ ఎన్టీఆర్ తో కీలక సన్నివేశాలున్నాయి. ఒలివియా మోరిస్ బాగానే ఉంది. ఆమె మొదటి సగంలో ప్రధాన భాగాన్ని కల్గి ఉంది. అజయ్ దేవగణ్ ప్లాష్ బ్యాక్ లో క్లుప్తంగా కనిపిస్తాడు. సముద్రఖని మంచివాడు అయితే రాహుల్ రామకృష్ణ ఎప్పటిలాగే ఆధారపడదగినవాడు. మిగిలిన వారిలో అలిసన్ డూడీ , రే స్టీవెన్సన్ బాగానే ఉన్నారు.

ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా ట్విస్టులున్నాయి. భీమ్ ను పట్టుకునేందుకే రామరాజు స్నేహం ఎలా చేశాడు? అసలు భీమ్-రామరాజుల మధ్య స్నేహం కుదిరింది? వారి ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది ? భీమ్ కు సాయం చేసినందుకుగాను రామరాజు ఎటువంటి శిక్షను ఎదుర్కొన్నాడు ? వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ లో సీత ఎలాంటి పాత్ర పోషిస్తుంది ? ఇక స్టోరీలో అజయ్ దేవగణ్, శ్రియ పాత్రలు కూడా కీలకంగా నిలిచాయి. చివరకు రామ్, భీమ్ ఇద్దరూ కలిసి బ్రిటీష్ సర్కారును ఎలా ఎదుర్కొన్నారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఇక ఈ సినిమా ఫస్టాఫ్ ఎమోషనల్ సీక్వెన్స్ తో మొదలవుతుంది. గిరిజన బాలికను బ్రిటీష్ వారు ఎత్తుకెళ్లిన సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. గిరిజన బాలికను బ్రిటీష్ వారు ఎత్తుకెళ్లిన సీన్ తో సినిమా మొదలవుతుంది. ఆ బాలికను రక్షించే ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుంది. కథ పరంగా బ్రిటీష్ సర్కార్ కు అనుకూలంగా పని చేసే పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఆదిలాబాద్ అడవుల్లో ఎన్టీఆర్ జూనియర్ యాక్షన్ ఎపిసోడ్ మరో హైలెట్ గా ఉంటుంది. పులితో తారక్ ఫైట్ పట్ల దర్శకుడు రాజమౌళి తీసుకున్న శ్రద్ధ వెండితెరపై స్పష్టంగా కనిపిస్తుంది.

మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పేరు గాంచిన రాజమౌళి కథ, కథనం పట్ల గతంలో తీసిన సినిమాల కంటే ఈ సినిమా తీయడంలో చాలా జాగ్రత్త వహించారని చెప్పొప్పు. పిక్చర్ లో ప్రతీ ఒక్క పాత్ర ఎంట్రీ ఇస్తున్న కొద్దీ కథ ఇంకా ఎమోషనల్ అవుతుండటం చూస్తుంటే ప్రేక్షకులు అట్టే సీట్లలో కూర్చుండిపోతాడు. భావోద్వేగాల పట్ల ఎమోషన్స్ చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న సీన్స్, ఎలివేషన్స్ చాలా అద్భుతంగా ఉంది.

బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఈ ఫిల్మ్ తిరగ రాస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య సినిమా కోసం పెట్టిన ఖర్చు వెండితెరపై కనబడుతుంది. సినిమా నిర్మాణంలో ఆయన ఇచ్చిన సహకారం మూవీ యూనిట్ సభ్యులకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చిందని చెప్పవచ్చు. ఎస్ఎస్ రాజమౌళితో రెగ్యులర్ గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఇంటర్వెల్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ మధ్య ఉన్న ఫైట్ సీక్వెన్స్ లను చూస్తుంటే ప్రతీ ఒక్క ప్రేక్షకుడు భావోద్వేగంలోకి వెళ్లి కంట తడి పెట్టుకుంటారు.

ఆర్ఆర్ఆర్ కు సంగీతం అందిస్తున్నారు. కాలం చెల్లిన సంగీత విద్వాంసుడు పాటలతో అందరినీ నిరాశపరిచాడు. కానీ అతను ఆ పాటలను నేపథ్య స్కోర్ తో సరిదిద్దాడు. రాజమౌళితో మరో రెగ్యులర్ సెంథిల్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సీక్వెన్స్ లు , నైట్ షాట్ లు అద్భుతంగా తీశారు.

ముఖ్యాంశాలు..
జూనియర్ ఎన్టీఆర్
రామ్ చరణ్
పరిచయాలు
ఎత్తులు
పై ఎత్తులు
చివరి 30 నిమిషాలు బాగుంది

లోపాలు..
సెకండ్ హాఫ్ లో
రామ్-సీత క్యారెక్టర్ ఆర్క్
రష్డ్ భాగాలు

బాటమ్ లైన్, యాక్షన్ డ్రామా, సినిమా రేటింగ్ 4/5