స్పెషల్ డ్రైవ్ లో దొరికిపోయిన డైరెక్టర్ త్రివిక్రమ్ 

స్పెషల్ డ్రైవ్ లో దొరికిపోయిన డైరెక్టర్ త్రివిక్రమ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. నగరంలోని జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ కారును పోలీసులు ఆపారు. కారుకు బ్లాక్ ఫిల్మ్ ను గుర్తించారు. దానిని తొలగించి, కారుకు జరిమానా విధించారు. అనంతరం ఆయనను వదిలేశారు. 4 రోజుల క్రితం హీరో మంచు మనోజ్ కారును కూడా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించి రూ. 700 చాలాన్ వేశారు.