వరంగల్ కమిషనరేట్ సైట్ ను ఆవిష్కరించిన డీజీపీ

వరంగల్ కమిషనరేట్ సైట్ ను ఆవిష్కరించిన డీజీపీ

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజల సౌకర్యార్షం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన సమాచారం, సేవలను అందుబాటులో తీసుకోచ్చేందుకుగాను వరంగల్ కమిషనరేట్ పోలీసులు నూతనంగా రూపొందించబడిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెబ్ సైట్ http://warangal police.telangana.gov.inను గురువారం వర్చువల్ ద్వారా రాష్ట్ర పోలీస్ డీజపీ యం. మహేందర్ రెడ్డి, డిజిపి కార్యాలయము నుండి ఆవిష్కరించారు. కాజీపేట్ నిట్ కళాశాలలోని బోస్ సమావేశ ప్రాంగణంలో వర్చువల్ పద్దతిలో ఏర్పాటు చేసిన ఈ వెబ్ సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమములో ముందుగా నూతనంగా రూపొందించబడిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెబ్ సైట్ లో పొందుపర్చిన అంశాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి డీజీపీకి వివరించారు.

నూతనంగా రూపొందించబడిన ఈ వెబ్ సైట్ లో ప్రజలకు జిల్లా చరిత్రతో పాటు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరు, ప్రజలకు అవసరమైన పోలీస్ స్టేషన్లు మరియు పోలీస్ అధికారుల పూర్తి సమాచారం, ఈ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయడం, నమోదైన ఎఫ్.ఐ.ఆర్ పరిశీలించడంతో పాటు వాటిని ప్రింటింగ్ పొందే అవకాశం ప్రజలకు వుంటుంది. సైబర్ క్రైం సంబందించి ఫిర్యాదు నమోదు, షీ టీం, హవ్, బరోసా సెంటర్, పోలీస్ వెరిఫికేషన్ మరియు పౌర సేవలు, మహిళ భద్రత కోసం వారికి అందించే సేవలు పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

ఆలాగే ఈ వెబ్ సైట్ ద్వారా ప్రజలు తమ వాహనాలపై పెండింగ్ చాలాన్స్ తెలుసుకోవచ్చని, నూతనంగా దరఖాస్తు చేసుకున్న పాస్పోర్ట్ ప్రస్తుత స్థితిగతులతో పాటు ప్రజల్లో నేరాలపై అవగాహన కల్పించే విధంగా సైబర్ నేరగాళ్ళ బారీ పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, నోటిఫికేషన్లు, వాట్సప్ ద్వారా ఫిర్యాదు మొదలైన అంశాలను ఈ వెబ్ సైట్లో పొందుపర్చడం జరిగిందని సీపీ వివరించారు. ముఖ్యంగా ఈ వెబ్ సైట్ డయల్ 100కు సమాచారం అందజేయవచ్చని అధికారులు తెలియజేశారు.

ముందుగా ఈ వెబ్ సైట్ రూపొందించడంలో శ్రమించిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషితో పాటు ఐటీ కోర్ ఆధికారులు సిబ్బంది మరియు వెబ్ సైట్ డిజైన్ చేసిన ఎక్సీలెంట్ సి.ఈ.ఓ సూర్య మరియు వారి సిబ్బందికి డీజీపీ అభినందనలు తెలియజేశారు. నేను చూసిన ఉత్తమమైన పోలీస్ వెబ్ సైట్లలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెబ్ సైట్ ఒకటని ఆయన అన్నారు. ప్రజలకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్లో పొందుపర్చడం జరిగిందని అన్నారు. ఇలాంటి వెబ్ సైట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు వారికి అందించగలమని తెలిపారు.

ఆలాగే శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు ప్రజలకు ఈ వెబ్ సైట్లు ఉపయోగపడుతాయని. ముఖ్యంగా పోలీసులు పనితీరును ప్రజలు తెలుసుకుంటారని, తెలంగాణ వ్యాప్తంగా ప్రజల సౌకార్యార్థం రాబోవు రోజుల్లో తెలంగాణలోని ప్రతి పోలీస్ యూనిట్లో వెబ్ సైట్ రూపొందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే అధికారులు ఈ వెబ్ సైట్ లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ సైట్ నిరంతరం కొనసాగించాలని. ఈ వెబ్ సైట్ నిర్వహణ ద్వారా పోలీస్, ప్రజల మధ్య సత్ససంబంధాలు మెరుగుపడుతాని డీజీపీ తెలియజేశారు.