ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీపై లక్నో ఘన విజయం
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ ( ఎల్ ఎస్ జీ) మూడో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టీం 6 వికెట్ల తేడాతో గెలిచింది. 150 రన్స్ టార్గెట్ ను ఆ జట్టు 2 బంతులు ఉండగానే అందుకుంది.క్వింటన్ డికాక్ (80) రన్స్ తో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి తర్వాత , కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో మొదట డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైని ఓడించి, ఆపై సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ను కూడా ఓడించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.