పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు 

పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

వరంగల్ టైమ్స్ , ఎడ్యుకేషన్ డెస్క్ : మే నెలలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజును చెల్లించడానికి విద్యాశాఖ మరోసారి అవకాశం కల్పించింది. రూ.1000 ఆలస్య రుసుముతో ఈ నెల 20 వరకు సంబంధిత పాఠశాలల్లో చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.తత్కాల్ స్కీం కింద రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.