ఢిల్లీ ఘన విజయం..కేకేఆర్ ఆలౌట్
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కేకేఆర్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో 215 పరుగుల భారీ స్కోరు చేసిన ఢిల్లీ..కోల్ కతాకు గెలిచే అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ ( 18), అజింక్య రహానే (8) ను తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చిన పేసర్ ఖలీల్ అహ్మద్ ఢిల్లీకి అద్భుతమైన ఆరంభం అందించారు. ఆ తర్వాత కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ( 54 ), నితీష్ రాణా ( 30) గెలుపుపై ఆశలు కల్పించారు. కానీ ఆండ్రీ రస్సెల్ ( 24 ) పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, శామ్ బిల్డింగ్స్ ( 15) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోవడంతో కేకేఆర్ ఓటమి ఖరారైంది.అప్పటికీ ప్యాట్ కమిన్స్ (4) క్రీజులో ఉండటంతో కొంత ఆశలు ఉన్నప్పటికీ కుల్దీప్ యాదవ్ అతన్ని ఔట్ చేసి వాటిని కూడా ఆవిరి చేశాడు. ఆ ఓవర్లో మూడు వికెట్లు తీసిన కుల్దీప్, ఢిల్లీ విజయాన్ని దాదాపు ఖరారు చేశాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో బంతి అందుకున్న శార్దూల్ ఠాకూర్ , రస్సెల్, రస్కిన్ సలామ్ ( 7) వికెట్లు తీసి కేకేఆర్ కథ ముగించాడు. దీంతో ఢిల్లీ జట్టు 44 పరుగుల తేడాతో కోల్ కతాపై ఘన విజయం నమోదు చేసింది.