ఈనెల 20న వరంగల్, నర్సంపేటకు కేటీఆర్ 

ఈనెల 20న వరంగల్, నర్సంపేటకు కేటీఆర్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఈనెల 20న వరంగల్, నర్సంపేటలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని పేర్కొన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష, టీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఈ నెల 20న కేటీఆర్ పర్యటనకు వస్తున్నందున ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి దయాకర్ రావు శనివారం సాయంత్రం పరిశీలించారు. హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులతో కలిసి మంత్రి దయాకర్ రావు కేటీఆర్ బహిరంగ సభ నిర్వహించే ఎల్బీ కాలేజీ మైదానాన్ని పరిశీలించారు. ఏప్రిల్ 20న కేటీఆర్ నియోజకవర్గ కేంద్రంతో పాటు వరంగల్ , హనుమకొండ, నర్సంపేట నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

అలాగే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అభివృద్ధి పనులతో కేటీఆర్ బిజీ బిజీగా గడపనున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల పై ఈ మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే సమీక్షించారు. బహిరంగ సభ స్థలం ఫైనల్ అయిన తర్వాత మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల రూట్ మ్యాప్ సిద్ధం కానుంది.