కాన్వాయ్ కి కారు పెట్టుకోలేని స్థితి రాష్ట్రంది
వరంగల్ టైమ్స్, అమరావతి: సీఎం జగన్ కాన్వాయ్ కోసం తిరుమల వెళ్లే భక్తుల కారును లాక్కెళ్లారని.. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.కుటుంబంతో తిరుమల వెళ్తున్న వినుకొండ వాసిని ఒంగోలు వద్ద పోలీసులు అడ్డుకుని ఆయన కారు తీసుకెళ్లిన ఘటనపై చంద్రబాబు స్పందించారు. ”భార్య, పిల్లలతో వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిది? కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లింది? ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడతారా? అధికారుల చర్యలతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు” అని ఆయన నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.