ఇఫ్తార్ లో పాల్గొని రంజాన్ కానుకలిచ్చిన దాస్యం
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : అధికారికంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి నిరుపేద ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రంజాన్ కానుకలు అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. జక్రీయా ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , పోలీసు కమిషనర్ తరుణ్ జోషి లతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుకలు అందించారు.
విందులో పాల్గొని వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ముస్లిం పెద్దలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 7 చోట్ల అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ముస్లింల ఉన్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని చీఫ్ విప్ గుర్తు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా 3500 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలు అందిస్తున్నట్లు చీఫ్ విప్ తెలిపారు.