అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఫార్మసీ ముసుగులో మత్తుమందు దందా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఇంటర్ నెట్ ఫార్మసీ, జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో వ్యాపారం చేస్తున్న ఆశీష్ జైన్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ లభించిన రూ. 3.71 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.ఇంటర్నెట్ ఫార్మసీ ముసుగులో అమెరికాతో పాటు విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గత రెండేళ్లలో వెయ్యికి పైగా డ్రగ్స్ ఆర్డర్లను పంపినట్లు, బిట్ కాయిన్స్, క్రొప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు నిర్వహించినట్లు నిర్ధారించింది. డ్రగ్స్ కు సంబంధించి ఆశీష్ నుంచి ఎన్సీబీ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తున్నది.