కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం
*జనవరి 2 , 3న కేరళలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత
*ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ కు హాజరుకానున్న కవిత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : జనవరి 2 , 3వ తేదీల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కల్వకుంట్ల కవితకు ఆహ్వానం పలికారు. జనవరి 2న సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు.
3 న సంస్కృతి పై జరిగే చర్చలో పాల్గొంటారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.