న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పోలీసుల ఆంక్షలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నూతన సంవత్సరం వేడుకల నిర్వహణకు తెలంగాణ పోలీసులు కొత్త నిబంధనలు పెట్టారు. నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ నిర్వహించేవారు పాటించాల్సిన నియమ నిబంధనలపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 1 గంటల వరకు నిర్వహించే వేడుకలకు నిర్వహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలి సూచించారు. త్రీ స్టార్ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెల్పారు. పబ్బుల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పబ్బుల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న పోలీసులుఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాలి. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్స్, పబ్బులలో నిర్వహించే వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదు. వేడుకల తర్వాత మద్యం సేవించినవారు డ్రైవింగ్ చేయకుండా, ఇంటికి చేరేలా చూసే బాధ్యత యాజమాన్యాలదేనని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకే మద్యం అమ్మకాలు చేయాలి, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్బుల్లో, ఈవెంట్స్ లో అశ్లీల నృత్యాలు అధిక శబ్దాలు వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈవెంట్స్ మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వహకులకు పోలీసులు సూచించారు. సామర్థ్యం కంటే ఎక్కువగా ఈవెంట్స్ పాసెస్ లుకానీ, పబ్స్ అనుమతి ఇవ్వకూడదు. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి డ్రగ్స్, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్బులు, ఈవెంట్స్ పార్కింగ్ ప్రదేశాల్లో డ్రగ్స్ అమ్మకాలు చేసిన యాజమాన్యందే బాధ్యత అని తెలిపారు. వేడుకల్లో ఈవెంట్స్, పబ్బుల నుండి బయటకు వెళ్లే వారికి క్యాబ్ లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వహకులదేనని సూచించారు.
స్టార్ హోటల్స్, పబ్స్, ఈవెంట్స్ లలో మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికితే 10,000 జరిమానా? ఆరు నెలలు జైలు శిక్ష తప్పదన్నారు. మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బులు ఈవెంట్స్ స్టార్ హోటల్ వద్ద పార్కింగ్ యాజమాన్యాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొత్తానికి న్యూ ఇయర్ వేడుకల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని నిర్వహకులకు, ప్రజలకు పోలీసులు సూచించారు.