ఆయుష్ పీజీ వైద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : రాష్ట్రంలోని ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపిజిఈటీ-2022 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో ఈ నెల 6 న ఉదయం 9 గంటల నుంచి 13న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.