ఆదివారం కూడా విడుదలైన రైతుబంధు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రైతుబంధు నిధులను ప్రభుత్వం ఆదివారం కూడా రైతుల అకౌంట్లల్లో జమ చేసింది. తాజాగా 8.53 లక్షల ఎకరాలకు సంబంధించి 1,87,847 మంది రైతుల ఖాతాల్లో రూ.426.69 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. దీంతో గత యేడాది డిసెంబర్ 28 నుంచి ఇప్పటివరకు మొత్తం 56.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,754.64 కోట్లు జమ చేశామని వివరించారు.