సీఎస్ సోమేశ్ కుమార్ రిలీవ్
వరంగల్ టైమ్స్, అమరావతి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎస్ సోమేశ్ కుమార్ ఈనెల 12లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీఓపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్ కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017 లోనే కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.