గల్లీ క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం 

గల్లీ క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం

వరంగల్ టైమ్స్, కామారెడ్డి జిల్లా : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గల్లీ క్రికెటర్ గా మారిపోయారు. ఓ గల్లీలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులను చూసిన ఆయన వెంటనే బ్యాట్ అందుకుని సిక్స్ లు బాదాడు. సందర్భం ఏదైనా పిల్లలు కనబడితే వారితో కలిసి సరదాగా ఆడుకోవడం పోచారం శ్రీనివాస్ రెడ్డికి అలవాటు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా పిల్లలు కనిపిస్తే మాత్రం వారిలో ఒకడిగా కలిసిపోతారు.

ఈరోజు బాన్సువాడ పట్టణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటిస్తున్నారు. పాత బాన్సువాడలోని చావడి వద్ద క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించారు. అంతే తాను కాసేపు బ్యాట్ పట్టుకుని సరదాగా పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు.