బాలయ్య మాటలకు.. పగలబడి నవ్విన పవన్​!

బాలయ్య మాటలకు.. పగలబడి నవ్విన పవన్​!

వరంగల్ టైమ్స్, అమరావతి : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ అన్​స్టాపబుల్ ఎపిసోడ్​ గురించి ఓ లేటెస్ట్ అప్డేట్​ రిలీజ్​ చేసింది ఆహా టీమ్​. ఎన్​బీకే అన్​స్టాపబుల్ సీజన్​ 2​ ఎపిసోడ్​కి సంబంధించిన ఆ గ్లింప్స్​ను విడుదల చేశారు. ‘నేను నీ కొలతలు తీసుకుంటా’ అంటూ బాలయ్య అనగానే.. పవణ్ కల్యాణ్ పగలబడి నవ్వారు. గ్లింప్స్​ రిలీజయ్యేకంటే ముందు నుంచే సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్. ట్విట్టర్​లో హ్యాష్​ట్యాగులతో ట్రెండింగ్ సైతం​ చేశారు. గ్లింప్స్​లో పవన్ అవుట్​ఫిట్​ కేక అని నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు. మరోవైపు ఎపిసోడ్​లో ఎటువంటి ప్రశ్నలు ఉండనున్నాయో అని ​ఆసక్తి కనబరుస్తున్నారు.