ఆ జిల్లాల్లో నాగబాబు రెండ్రోజుల పర్యటన
వరంగల్ టైమ్స్, విజయవాడ : జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు ఈ నెల 21న కర్నూలు జిల్లా, 22 న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. 21న శనివారం ఉదయం కర్నూలు జిల్లా వీర మహిళల కోసం ఏర్పాటు చేసిన సభలో, మధ్యాహ్నం జన సైనికులకు ఏర్పాటు చేసిన సభలో నాగబాబు పాల్గొని ప్రసంగిస్తారు. 22 ఆదివారం అనంతపురం జిల్లా వీర మహిళలు, జనసైనికుల కోసం ఏర్పాటు చేసిన సభలలో నాగబాబు పాల్గొని ప్రసంగిస్తారు.