జమున మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
వరంగల్ టైమ్స్, అమరావతి : అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జమున మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జమున మృతితో తెలుగు చిత్రసీమలో స్వర్ణయుగానికి తెరపడిందని ఆయన అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.