రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కేంద్రం : చల్లా
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటున్నదని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.పరకాల పట్టణంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ, పరకాల రూరల్ (35 మంది), నడికూడ (40 మంది), ఆత్మకూరు ( 21 మంది), దామెర ( 20 మంది) మండలాలకు చెందిన 116 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు గాను రూ.1కోటి 16లక్షలకు పైగా విలువచేసే చెక్కులను పంపిణీ చేశారు.
పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరంగా మారిందని ఎమ్మెల్యే చల్లా అన్నారు.నిరుపేదల కళ్లల్లో ఆనందం చూసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల హాయంలో గ్రామీణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి, గురయ్యాయని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతీ నెల గ్రామపంచాయతీలకు నిధులు అందిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్ పర్సన్, పరకాల, నడికూడ, ఆత్మకూరు, డామెర మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీలు,సర్పంచులు,ఎంపీటీసీలు,మార్కెట్ చైర్మన్లు,రైతుబంధు సమితి సభ్యులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.