నెల్లూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా : కోటంరెడ్డి

నెల్లూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా : కోటంరెడ్డి

వరంగల్ టైమ్స్, నెల్లూరు :ఎన్నికల్లో తాను నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంలో ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. ట్యాపింగ్ అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలు బయటపెడితే ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. మీ అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.