అభివృద్ధిలో ఎమ్మెల్యే చల్లాకు నీరాజనాలు లు 

అభివృద్ధిలో ఎమ్మెల్యే చల్లాకు నీరాజనాలు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: మహిళా అభ్యుదయానికి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.గురువారం దామెర మండల కేంద్రంలో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించబోయే మహిళా భవనం మరియు గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. మహిళా భవనం నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయడం కోసం వచ్చిన ఎమ్మేల్యేకి గ్రామ ఆడపడుచులు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందజేస్తుందని ఎమ్మెల్యే చల్లా తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు ప్రభుత్వానికి వారధిగా గ్రామైక్య సంఘాలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐకేపీ ఉద్యోగులకు గౌరవవేతనాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. మహిళా సంఘాలు బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌గా ఎదగాలని,ఇందుకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఐకేపీ వీవోఏలో మహిళల్లో పొదుపును అలవాటు చేసి వారిని ఆర్థిక క్రమశిక్షణలో పెడుతున్న మహిళా సంఘాల నిర్వాహకుల పాత్ర చాలా గొప్పదని ప్రశంసించారు. నియోజకవర్గంలో 42గ్రామాలలో మహిళా భవనాలు నిర్మాణ పనులు ప్రారంభించుకున్నట్లు వారు తెలిపారు.త్వరలోనే ప్రతీ గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి కృషిచేస్తానని తెలిపారు. అదే విధంగా సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు కూడా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. లంగాణ ఏర్పడ్డ తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామాల్లో,తండాలలో మంచినీరు, విద్యుత్‌, రోడ్లు తదితర సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఘనత కేసీఆర్ గారిదన్నారు.రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిస్థుతులు,ఆ తర్వాత పరిస్థితులు ప్రజలంతా గమనించాలి.ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్ గారిది.మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటిసి,వైస్ ఎంపిపి,సర్పంచులు,ఎంపిటిసిలు, మార్కెట్ కమిటీ మరియు సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు,ఎంపీడీఓ, తహశీల్దార్, ఏపీఓ,ఏపిఎం,పంచాయతీ రాజ్ శాఖ డిఈ, ఏ.ఈ,విద్యుత్ శాఖ ఏ. ఈ మహిళ సంఘాల అధ్యక్షులు,సభ్యులు తదితులు పాల్గొన్నారు.