కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన టీ ఎంపీలు,ఎమ్మెల్యే 

కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన టీ ఎంపీలు,ఎమ్మెల్యే

 వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రాష్ట్ర ఎంపీలు రవిచంద్ర, బండి పార్థసారథి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులు కలిసారు. ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా,రోడ్లకిరువైపులా డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశారు. ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం గడ్కరీతో సమావేశమైన వారు తమ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులు, వాటి విస్తరణ, కొత్తగా కట్టిన కలెక్టరేట్ వద్ద అలైన్మెంట్ మార్పు,డ్రైన్స్ మంజూరు చేయాల్సిన అవసరం గురించి వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యే తన దృష్టికి తెచ్చిన అంశాలను కేంద్ర మంత్రి సావధానంగా విని సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా వారు గడ్కరీకి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు.