వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. సంబంధిత పత్రాలను కార్యదర్శి నరసింహచార్యులకు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీలతో కలిసి బండ ప్రకాష్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మధుసూదనచారి, వి.జి గౌడ్, తాత మధు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home Telangana