తన న్యూ మూవీ గురించి చెప్పనున్న డీజే టిల్లు!
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : యాక్టర్‌గా, స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన డీజే టిల్లు సినిమా జనాలకు ఏరేంజ్‌లో కనెక్ట్ అయిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్యాండమిక్ తర్వాత టాలీవుడ్‌లో ఓ ఊపు తెచ్చిన సినిమాల్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది డీజే టిల్లుకి. సినిమాల సెలక్షన్ విషయంలో సిద్ధు జొన్నలగడ్డ చాలా చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. అలాంటి సిద్ధు ఇప్పుడు ఓ కథను లాక్ చేశారు. తన 31వ బర్త్ డే సందర్భంగా మంగళవారం ఈ సినిమా గురించి ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ.
సిద్ధు జొన్నలగడ్డ నటించే 8వ సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీయస్‌యన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స నిర్మిస్తున్నారు. వైష్ణవి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వయర్‌లో నటిస్తున్నారు. లేటెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో నటిస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. బర్త్ డేకి స్వీట్ సర్‌ప్రైజ్ అంటున్నారు ఫ్యాన్స్.