తారకరత్న పరిస్థితి విషమం

తారకరత్న పరిస్థితి విషమం

వరంగల్ టైమ్స్, బెంగుళూర్ : నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. ఇప్పటికే కుటుంబసభ్యులు బెంగుళూరు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో తారకరత్న ఆరోగ్యం పరిస్థితిపై డాక్టర్లు బులిటెన్ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ హుటాహుటిన బెంగుళూరు చేరుకున్నారు. బాలయ్య తో పాటు నందమూరి కుటుంబసభ్యులు కూడా బెంగుళూరుకు పయనమయ్యారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నకు విదేశీ వైద్యులతో సైతం చికిత్స అందిస్తున్నారు. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినప్పటికీ మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొంటున్నారు.

 

ఈ క్రమంలో మరికాసేపట్లో సాయంత్రం తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. నందమూరి తారకరత్న కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మరికాసేపట్లో ప్రకటించనున్న హెల్త్ బులిటెన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనవరి 27న లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తారకరత్న కూడా హాజరయ్యారు. కుప్పంలో పాదయాత్ర మొదలైన రోజున జరిగిన తోపులాటలో ఊపిరి అందాక హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.