ప్రారంభమైన మహిళల దేహదారుఢ్య పరీక్షలు 

ప్రారంభమైన మహిళల దేహదారుఢ్య పరీక్షలు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : స్టయిఫండరి పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ల నియామకంలో భాగంగా నేటి నుండి మహిళా అభ్యర్థినులకు దేహ దారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. కేయూ మైదానంలో గురువారం మహిళలకు నిర్వహించిన దేహాదారుద్య పరీక్షలకు 1159 అభ్యర్థునులకుగాను 839 మంది అభ్యర్థినులు హాజరయ్యారు. ఇందులో 491 మంది మహిళా అభ్యర్థినులు తుది పరీక్షకు అర్హత సాధించారు.

ఈ దేహదారుఢ్య పరీక్షలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ఈ దేహ దారుఢ్య పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయని, దళారీల మాట నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ డి.మురళీధర్, అదనపు డీసీపీలి సురేష్, సంజీవ్ తో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, కమ్యూనికేషన్, ఐటీ, మెడికల్ విభాగం కు చెందిన అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.