వారిద్దరూ కలిశారు..చాలా ఆత్మీయంగా !

వారిద్దరూ కలిశారు..చాలా ఆత్మీయంగా !

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాజకీయాల్లో వారిద్దరూ బద్ద శత్రువులు. నిత్యం పరస్పరం విమర్శలు చేసుకుంటారు. కానీ ఇవాళ పక్కన పక్కన కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు ఆదివారం నాడు మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారు.

అవకాశం దొరికితే చాలు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేస్తుంటారు. సోషల్ మీడియాతో పాటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబుపై, టీడీపీపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తుంటారు.

అయితే తారకరత్న నివాసంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డిలు పక్క పక్కనే కూర్చుని చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.సందర్భం వేరే అయినా ఎప్పుడూ విమర్శించుకునే వీళ్లద్దరూ మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందనుకోవచ్చు. అయితే బంధుత్వాల విషయానికొస్తే పార్టీలు, వ్యతిరేకతలు పక్కన పెట్టి వాళ్లిద్దరూ తమ సంస్కారాన్ని, ఆత్మీయతను చాటుకున్నారే చెప్పవచ్చు.