చదువుకునేందుకు మొహాలి వెళ్తున్నా : వంశీ
వరంగల్ టైమ్స్, విజయవాడ : తాను చదువుకోవడానికి మొహాలి వెళ్తున్నానని, 15 రోజుల వరకు గన్నవరం రానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. విజయవాడలో కొందరు సన్నాసుల వల్లే గన్నవరం గొడవ జరిగిందని ఆరోపించారు. అది చంద్రబాబు వేసిన పక్కా ప్రణాళిక అని, సీన్ కాస్త రివర్స్ అయ్యేసరికి టీడీపీకి షాక్ తగిలిందని చెప్పారు. గన్నవరం ఘటనపై టీడీపీ కేసు పెట్టలేదని తెలిపారు.