ఇక రాత్రి వేళల్లో శ్రీశైలానికి వాహనాలు నిషేధం
వరంగల్ టైమ్స్, ప్రకాశం జిల్లా : శ్రీశైలం వెళ్లే వాహనాలకు నేటి నుంచి రాత్రి వేళల్లో ప్రయాణం నిషేధిస్తున్నట్లు దోర్నాల ఫారెస్ట్ రేంజర్ విశ్వేశ్వరరావు తెలిపారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు వాహనాలను నిషేధించడం జరుగుతుందన్నారు. ఇటీవల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు శ్రీశైలం వెళ్లే వాహనాలకు 24 గంటలు రాకపోకలకు అటవీశాఖ అనుమతినిచ్చింది. అయితే ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఈ నిషేధం యధావిధిగా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.